మిర్యాలగూడ, 8 September
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ మిర్యాలగూడలో దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతామధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకుల భారీ నిరసన ర్యాలీ : మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ..మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్) ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేతిలో భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువ లకువిరుద్ధమన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకత్వంలోని అహంకార ధోరణికి నిరసనగా కేటీఆర్, హరీష్ రావు, తాతా మధుసూదన్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూప్రజల కోసం మాట్లాడేసింది పోయి తమ స్వార్ధ రాజకీయాల కోసం అసెంబ్లీ వేదికగా చేసుకునే ప్రయత్నం బిఆర్ఎస్ వారు చేస్తున్నారన్నారు. సభకువచ్చిసమస్యలపై మాట్లాడడానికి బదులు సభ బయట అరాచకం చేస్తున్నారన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భద్రతా సిబ్బందిపై దౌర్జన్యం చేశారని, అనేకమంది పోలీ సులపైదాడి చేశారని ఆరోపించారు.సభాపతిగా స్పీకర్ కి ప్రతి సభ్యులు గౌరవం ఇవ్వాల్సిందే స్పీకర్ చైర్మన్ గౌరవించకపోతే మొత్తం సభను అవమానించినట్టేనని, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఇలాంటి భాషను వాడిన ఎమ్మెల్సీ తాతా మధు పైచర్యలుతీసుకోవాల్సిందేనని పేర్కొ న్నారు.ఈ కార్యక్ర మంలో దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధు లు,నాయకులు, శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు.












