ఆదిలాబాద్, 8 September
తానూరు మండలంలోని అంగీర్గా గ్రామంలో సంగీత సాయి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తానూరు: మండలంలోని అంగీర్గా గ్రామంలో సంగీత సాయి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. రెండో దశలో కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటిని నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు పోశెట్టి, బాలాజీ, బాబూరావు, సిద్ధార్థ, భూమన్న, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్, లక్ష్మణ్, మాధవరావు పటేల్, ఆనందరావు పటేల్, యోగేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












