రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో భూస్థాపితం చేసి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నంద్యాల మున్సిపాలిటీని ఘనంగా కైవసం చేసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో భూస్థాపితం చేసి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నంద్యాల మున్సిపాలిటీని ఘనంగా కైవసం చేసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రతి వార్డులోనూ ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకోవాలని, వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు హామీలను ఎండగట్టాలని కోరారు. ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు.












