మిర్యాలగూడ, 8 September
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఈ నిరసనకు నాయకత్వం వహించారు.
మహిళాఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించడం దుర్మార్గం : నల్లమోతు భాస్కర్ రావు 👉 ర్యాలీ.. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) తెలంగాణ అసెంబ్లీలో బి.ఆర్.ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు శాసన మండలి సభ్యులను అవమానించేలా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో మంగళ వారంపెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశమై అసెంబ్లీలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి సాగర్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి,అక్కడవినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లిన మహిళా ప్రజాప్రతి నిధులను అవమా నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. మహిళలను గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, తన చర్యల ద్వారా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల తన వైఖరిని బయటపెట్టిందని విమర్శించారు.మహిళా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు జరిగిన అవమానంపై ప్రభుత్వం వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పనవిజయసింహారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, సంపత్, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి , నాగార్జునచారి,పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎండి ఇలియాస్ ఖాన్ , పెద్ది శ్రీనివాస్ గౌడ్ ,ఎండి మగ్ధుం, షహనాజ్ బేగం, భాష ,చౌగని బిక్షం గౌడ్, ఎండి. మాజిద్, రవీందర్ నాయక్, పోకల రాజు, విక్టర్, గుడిసె దుర్గ ప్రసాద్, పి సి కె ప్రసాద్, జిడిఆర్ జాని, భీమ్లా నాయక్, రాబర్ట్, మారుతి వెంకట్ రెడ్డి, పెండ్యాల పద్మావతి ,ధూళిపాల కళావతి ,కుర్ర చైతన్య, రుక్సానా, పెరుమాళ్ళ ధనమ్మ, చిత్రం ఉమా, కోదాటి రమ, బాణావత లలితా నాయక్ ,దీపిక, గుడిశ జానకమ్మ, సందేశ్ రజిని, లావుడి అరుణ, జలపాల సునీత, ఆంగోతు హాతిరాంనాయక్ ,బారెడ్డి అశోక్ రెడ్డి, ఎండి గయాస్, మస్తాన్, జెరిపోతుల రాములు గౌడ్, ధనావత వెంకటేశ్వర్లు నాయక్, కట్ట మల్లేష్ గౌడ్, సైదా నాయక్, రమేష్ నాయక్, మండల్ సైదాచారి, ఎర్రమళ్ళ దినేష్, సిరసనగండ్ల ఈశ్వర చారి, ఎలుగుబెల్లి నాగరాజు, వినోద్ నాయక్, కొండారపు నాగేశ్వరరావు, దైద సత్యం, దైద వెంకటేష్, మరి అంజిబాబు, భూక్య రాంబాబు,మాలి రేణుక,బంటుకాత్యాయని, గంటా శ్రావణ్ రెడ్డి ,బెడదూరి శ్రీనివాస్ రెడ్డి, బంటు నాగయ్య, శంకర్ నాయక్, చలికంటి యాదగిరి, కొర్ర చిన్న నాయక్, నూనె మమత మంగ నాయక్ , పార్టీ మహిళా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్చార్జ్లు,నాయకులు,కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












