తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను లో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేసిన డాక్టర్ పిడమర్తి రవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని ముఖ్యమంత్రికి జేఏసీ విజ్ఞప్తి చేసింది.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్ మాదిగ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. భవిష్యత్తులో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణతో పాటు సంక్షేమ పథకాల అమలులో మాదిగ ఉపకులాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, రాష్ట్రం ఏర్పడే వరకు అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమకారుడు, మాదిగ జాతి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన డాక్టర్ పిడమర్తి రవికి సముచిత గుర్తింపు కల్పించాలని వారు కోరారు.
ఆయన సేవలను గుర్తించి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యదర్శి బిక్కీ గంగన్న మాదిగ, తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కత్తి గంగాధర్ మాదిగ, జిల్లా కార్యదర్శి తార రవికుమార్ మాదిగ, మండల అధ్యక్షులు జెల్ల మహేందర్ మాదిగ, పట్టణ అధ్యక్షులు బట్టు మహేందర్ మాదిగ, పట్టణ కార్యదర్శి మంద సురేష్ మాదిగ, డివిజన్ కార్యదర్శి కాంపెల్లి మల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.












