కుబీర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కుబీర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందూర్ సంతోష్, మాజీ సర్పంచ్ మీనా విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ శంకర్ చౌహాన్, డైరెక్టర్ రాజాసింగ్ తదితరులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.












