బైంసా మండలంలోని దేగాం గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు.
కొడంగల్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో, నూతన పెన్షన్ల మంజూరు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారని అన్నారు. ఇందిరమ్మ బీమా పథకం ద్వారా భూమిలేని నిరుపేదలకు కూడా బీమా సౌకర్యం కల్పించడానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఆయన అన్నారు.
ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొబ్బిలి శ్రీను, మాజీ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్, మాజీ జిల్లా వైస్ చైర్మన్ రాజన్న, మౌలాఖాన్, వార్డు మెంబర్లు సుదర్శన్ గౌడ్, సాయి, ఆనంద్, చోటు, ఎల్లా రాజేశ్వర్, వాటోలి సర్పంచ్ ఎగ్గం నడిపి సాయన్న, ఉప సర్పంచ్ గాఫోర్, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, మాజీద్ చౌదరి, చందు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కిష్టన్నా, సాయిలు, రమేష్, వాగమరే శ్రీను, బొగ్గుల మహేష్, వాగమరే గౌతమ్, అబ్దుల్ రియాజ్, ఇక్బాల్ అహ్మద్, అన్వార్, ఫరూక్, జాదవ్ సోమాజి, శానే అవినాష్ మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












