ముధోల్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ, అంగన్వాడి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. కుంటాల మండల కేంద్రంలో జిపి భవన నిర్మాణానికి 20 లక్షలు, లోకేశ్వరం మండలంలోని బామ్ని కే లో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షలు, లోకేశ్వరం మండలంలోని థర్మోరా, జోహార్ పూర్, లోకేశ్వరం, మన్మధ్, పంచగుడి, పుస్పూర్ గ్రామాల్లో అంగన్వాడీ భవనాల ఒక్కో దానికి 12 లక్షల రూపాయల నిధులు, రాజురా, వటోలి గ్రామాల్లో అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఒక్కో దానికి 12 లక్షల రూపాయల నిధులు, రాజేష్ తండాలో ఫెడరేషన్ భవనానికి 10 లక్షలు, వర్క్ షెడ్ కు 10 లక్షలు మంజూరు అయ్యాయి.
ముధోల్ మండలం లోని వడ్తల గ్రామం లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 10 లక్షలు, ఫెడరేషన్ భవన నిర్మాణానికి 10 లక్షలు, బోరిగామ్ గ్రామం లో రెండు వర్క్ షెడ్ ల నిర్మాణానికి 20 లక్షల నిధులు మంజూరు అయ్యాయి.
నర్సాపూర్ మండలం లోని బామ్ని బి, నందన్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఒక్కో దానికి 10 లక్షలు, నందన్ లో అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షలు.
బాసర మండలం లోని దోడపూర్ గ్రామం లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షలు, బాసర, శారదానగర్ ఫెడరేషన్ బిల్డింగ్ లకు ఒక్కో దానికి 10 లక్షలు.
భైంసా మండలం లోని గుండెగాం, హాజ్గుల్, కుంబి, లింగా గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ఒక్కో దానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి.
భైంసా మండలం లోని తిమ్మాపూర్ గ్రామం లో అంగన్వాడీ భవన నిర్మాణానికి 12 లక్షలు, దేగాం గ్రామం లో వర్క్ షెడ్ కు 10 లక్షలు, ఫెడరేషన్ భవనానికి 10 లక్షల రూపాయల నిధులు.
కుభీర్ మండలం లోని బెల్గం తండాలో అంగన్వాడీ, వర్క్ షెడ్, ఫెడరేషన్ భవన నిర్మాణానికి 32 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.
ఫాఖీర్ నాయక్ తండా, చాత గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఒక్కో దానికి 20 లక్షలు, దావుజీ నాయక్ తండా, దొడర్నా, న్యూ సాంవ్లీ, రంగ శివిని, శివుని తండా, వీరేగాం తండాలో 12 లక్షల రూపాయలతో అంగన్వాడీ వాడి భవనాల నిర్మాణానికి నిధులు, సిరిపెల్లి, వీరేగాం తండాల్లో వర్క్ షెడ్, ఫెడరేషన్ బిల్డింగ్ ల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు చెప్పారు.












