నిర్మల్ జిల్లా మండలంలోని ఝరి బి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన గుర్ల శోభాబాయి, ఫిరోజీ కుటుంబం గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులను శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గైక్వాడ్ సాయినాథ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని అన్నారు. నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి, ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఝరి బి గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మరిన్ని పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.











