మండల కేంద్రంలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జ్ దుబ్బాసు రాములు, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు అంబాటి విట్టల్ గౌడ్ మాట్లాడారు. 1931లో బొంబాయిలో ఏర్పాటైన ఏఐటీయూసీ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధించడంతోపాటు కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందని అన్నారు. బ్రిటిష్ పాలనలోనే కార్మిక హక్కుల సాధనకు ఉద్యమించిందని గుర్తు చేశారు. స్వాతంత్రం అనంతరం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. వీటి వల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంటూ, వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి నల్లగంగాధర్, సిపిఐ పోతంగల్ మండల కార్యదర్శి ప్రసాద్, నాయకులు నీలి శంకర్, సోమ వీరేశం, శివరాజ్, పోశెట్టి, సాయిలు, రాజు, దత్తు తదితరులు పాల్గొన్నారు.












