నిర్మల్ జిల్లాలో జరగనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. లక్ష్మణ్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
నిర్మల్ లో జరగనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని లక్ష్మణ్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో నిర్మల్ ఇన్చార్జులు సరికెల గంగన్న, సమ రాజేశ్వర్ రెడ్డి, కమల్ నయన్ లు తెలిపారు. ఈ పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని వారు వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు గాండ్ల చిన్నయ్యతో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి, దానిని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులను సమన్వయపరిచి, అధిక సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని సూచించారు.

