రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, సొసైటీల చైర్మన్ పదవుల కేటాయింపులో తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం పట్ల ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ బట్ట వెంకట్ రాములు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కనీసం ఒక్క చైర్మన్ పదవైనా మాదిగలకు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన విమర్శించారు.
మండలం తిప్పాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మాదిగ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ మండల కమిటీల ఏర్పాటులో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సొసైటీలకు చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టే అర్హత మాదిగలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మాదిగలు గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ పదవుల కేటాయింపులో నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాదిగలను చిన్నచూపు చూడటం మానుకోవాలని, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆయన కోరారు.
ఈ విషయంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించి జిల్లాలో మాదిగలకు సొసైటీ చైర్మన్ పదవిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని బట్ట వెంకట్ రాములు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, మహిళా జిల్లా అధ్యక్షురాలు బానపురం లావణ్య, నడిపి రామస్వామి, దుర్గయ్య, రాజు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.











