ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనేందుకు జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరారు.
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించనున్న ఈ సభలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నాయకులు ఢిల్లీ పర్యటనకు పయనమయ్యారు.












