తానూరుకు చెందిన భీంరావ్ పవార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా దేగాంలోని ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారి నివాసంలో, ఆయన ఆధ్వర్యంలో భీంరావ్ పవార్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు భీంరావ్ పవార్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు కట్టే శ్యామ్ గారికి, జిల్లా కమిటీ సభ్యులకు మరియు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మాజీ ఎంపీటీసీ లచ్చన్న, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, బామ్నీ ఉప సర్పంచ్ గంగాధర్, ఆసమ్ మాధవ్ గైక్వాడ్ సాయినాథ్ గంగారెడ్డి, మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.