మండల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గణేష్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. షాద్‌నగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన మండల గిరిజన నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు గణేష్ నాయక్ తెలిపారు.
షాద్‌నగర్ క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల గిరిజన నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులు శ్రీనునాయక్, రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, పీఎస్సీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. అనంతరం ఉప్పరిగడ్డ గ్రామానికి చెందిన గణేష్ నాయక్‌ను ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన గణేష్ నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల మాజీ అధ్యక్షుడు శక్రు నాయక్, పుల్చర్లకుంట సర్పంచ్ రాజు నాయక్, కడియాలకుంట మాజీ సర్పంచ్ రాజు నాయక్, వెంకటరెడ్డిపల్లి సర్పంచ్ రమేష్ నాయక్, గుట్టతండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, అన్నారం మాజీ సర్పంచ్ బాలునాయక్, ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్, నెహ్రూ నాయక్, వెంకన్నగూడ తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, మున్నూరు రైతన్న గ్రామ మాజీ సర్పంచ్ రవి నాయక్, సుమన్ నాయక్, వేణు నాయక్, రాము నాయక్, తులసీరామ్ నాయక్, డాక్టర్ రవి నాయక్, సంజు నాయక్, కుమార్ నాయక్, దంతికుంట రాజు నాయక్, సంతోష్ నాయక్, సలవత్ సంతు నాయక్, దేవునిగుడి తండా మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, సుభాష్ నాయక్, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.












