నిర్మల్ జిల్లా మండలంలోని ఝరి బి గ్రామానికి చెందిన గుర్ల భోజన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ శాసనసభ్యులు జి.విఠల్ రెడ్డి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుర్ల భోజన్న మృతి పట్ల విఠల్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులైన గుర్ల దర్శన్, గుర్ల అశోక్, గుర్ల దినేష్లను ఆయన కలిసి, వారికి మనోధైర్యం కల్పించారు. భోజన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల దేవిదాస్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి మౌలఖాన్, బొడ్డోళ్ళ నాగన్న, ఆసం బాబు, జెల్లెవార్ రాములు, దిగంబర్ పటేల్, గుర్ల కేశవ్, ఆసం మాధవ్, దొంతుల రమేష్, గుర్ల పిరాజి, శ్రీనివాస్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












