బోరిగాం, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 08
బోరిగాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
బోరిగాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి నాయకులు దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ప్రాముఖ్యతను నాయకులు వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సొంతింటిలో సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముత్యం రెడ్డి, నాగసింగ్, సర్పంచ్ గోదావరి శ్రీనివాస్, పి. అశోక్, డి. శ్రీనివాస్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

