ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో లాటరీ పద్ధతిని పక్కనపెట్టి, నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లు కేటాయించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ద్వారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో లాటరీ పద్ధతిని పక్కనపెట్టి, నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లు కేటాయించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ద్వారా నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్గట్ల, సంయుక్త మండలాల కార్యదర్శి జి. కిషన్, మండల నాయకురాలు వి. సత్తెమ్మ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటిస్తూ, సొంత ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన లబ్ధిదారులను న్యాయబద్ధంగా గుర్తించి, ప్రభుత్వ పథకం నిజమైన పేదలకు చేరేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దహల్ సింగ్, దండ్ల అంజలి, గంగక్క, గోపి, సౌందర్య, శంకర్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.












