ప్రముఖ పంజాబీ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలాకు చెందిన ఫాంటమ్ పాట విడుదలపై వివాదం నెలకొంది. తమ అనుమతి లేకుండానే పాటను విడుదల చేశారని ఆయన తల్లిదండ్రులు బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ మ్యూజిక్ లేబుల్ సాగా మ్యూజిక్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుమారుడి సంగీత హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వారు ప్రకటించారు.
సాగా మ్యూజిక్ వాదన
మరోవైపు సాగా మ్యూజిక్ ఈ ఆరోపణలను అంగీకరించడం లేదు. 2020లోనే సిద్దూ మూసేవాలా తమతో ఒప్పందం చేసుకున్నారని, ఆ పాట హక్కులను అప్పుడే తమకు ఇచ్చారని సంస్థ వాదిస్తోంది. పాట నిర్మాణం, మ్యూజిక్ ప్రొడక్షన్, వీడియో తయారీకి తాము ఖర్చు చేశామని కూడా పేర్కొంది. ఈ వివాదంపై తమ వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయని సంస్థ చెబుతోంది.
గతంలోనూ ఇలాంటి వివాదం
2022లో జాందీ వార్ పాట విడుదల విషయంలోనూ సిద్దూ మూసేవాలా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో కూడా అనుమతి లేకుండా పాటను విడుదల చేయవద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న హత్యకు గురైన సిద్దూ మూసేవాలా మరణించిన తర్వాత కూడా ఆయన పాటలకు అభిమానుల్లో ఆదరణ కొనసాగుతోంది. తాజాగా ఫాంటమ్ పాట వివాదం మరోసారి ఆయన సంగీత హక్కులపై చర్చకు దారితీసింది.





