నిర్మల్, 14 November
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ () జిల్లా ఆధ్వర్యంలో శనివారం లోని ఆర్.కె. కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన గురుశ్రేష్ఠ అవార్డు ప్రదానోత్సవంలో బాసర నాగభూషణ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయుడు శరత్ గైక్వాడ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి నిర్వాహకులు ఈ పురస్కారంతో సత్కరించారు.
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ () జిల్లా ఆధ్వర్యంలో శనివారం లోని ఆర్.కె. కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన గురుశ్రేష్ఠ అవార్డు ప్రదానోత్సవంలో బాసర నాగభూషణ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయుడు శరత్ గైక్వాడ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి నిర్వాహకులు ఈ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా శరత్ గైక్వాడ్ మాట్లాడుతూ, తన విద్యా సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన ప్రతినిధులకు, తనను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ జారికోటే బాబురావు, తోటి ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.






