కృత్రిమ మేధ () శిక్షణ కోసం సంస్థలు తమ డేటాను సురక్షితంగా వినియోగించుకునేలా, అదే సమయంలో ఆ డేటాపై నియంత్రణను కొనసాగించేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ () ఒక కొత్త హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ () ఫర్ ట్రైనింగ్ పేరుతో రూపొందించిన ఈ హ్యాండ్‌బుక్‌ను శనివారం బెంగళూరులో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఆవిష్కరించారు.
వ్యవస్థలకు శిక్షణ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో విభిన్నమైన, నాణ్యమైన డేటా అవసరం. అయితే గోప్యత, సమాచార రహస్యాలు, మేధో సంపత్తి హక్కులు, సంస్థల డేటాపై నియంత్రణ వంటి అంశాల కారణంగా బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలు తమ డేటాను ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడుతుంటాయి. ఈ సమస్యలను పరిష్కరించడమే విధానం ప్రధాన లక్ష్యం.
ఈ విధానం ద్వారా సంస్థలు తమ డేటాను పూర్తిగా ఇతరులకు అప్పగించకుండానే, నిర్దిష్ట ప్రయోజనాల కోసం శిక్షణలో ఉపయోగించుకునేందుకు సహకరించవచ్చు. ఇందుకోసం ఒప్పందపరమైన అనుమతులు, నియంత్రిత కంప్యూటింగ్ వాతావరణాలు, గోప్యతను కాపాడే భద్రతా చర్యలను ఇందులో పొందుపరిచారు. అలాగే డేటా ఎక్కడి నుంచి వచ్చింది, దాని వినియోగానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, శిక్షణ ప్రక్రియలో దాన్ని ఎలా ఉపయోగించారు అనే వివరాలను కూడా గుర్తించగలిగేలా డేటా ప్రోవెనెన్స్ వ్యవస్థను చేర్చారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
డేటా వద్దకే మోడల్
ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఈ విధానం గురించి వివరిస్తూ, లో డేటా మోడల్ వద్దకు వెళ్లదు. మోడలే డేటా వద్దకు వెళ్తుంది అని అన్నారు. దీనివల్ల డేటాను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు తరలించాల్సిన అవసరం లేకుండానే పలు సంస్థలు కలిసి మోడళ్లను అభివృద్ధి చేయగలవని తెలిపారు. బహుళ సంస్థల మధ్య, దేశాల సరిహద్దులు దాటి కూడా సురక్షితమైన సహకారానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.
శాస్త్రీయ పరిశోధన వేగవంతం కావడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సమ్మిళితమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థ అభివృద్ధికి భారత్ చేస్తున్న కృషిలో ఇది కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణించారు.
బాధ్యతాయుతమైన అభివృద్ధికి భారత్ కట్టుబాటు
భారత్ రంగంలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు అనుగుణంగా డేటాను బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించే సామర్థ్యం కూడా అవసరమని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ అన్నారు. గోప్యత, వాణిజ్య రహస్యాలు, సంస్థల డేటాపై నియంత్రణను కాపాడుతూనే పెద్ద స్థాయిలో డేటా సహకారానికి శిక్షణ విధానం అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని చెప్పారు.
తో పోల్చిన సహ వ్యవస్థాపకుడు
ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు శరద్ శర్మ ఈ హ్యాండ్‌బుక్ విడుదలను భారత డేటా ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామంగా అభివర్ణించారు. 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ () ప్రకటించినప్పటి నుంచి ఇంతటి ప్రాధాన్యమున్న పరిణామం ఇదేనని వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, పరిశోధకులు విభిన్న డేటాసెట్లను సురక్షితంగా వినియోగించుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని అన్నారు. దీనివల్ల మరింత సమర్థవంతమైన మోడళ్ల అభివృద్ధి, పరిశోధనా సంస్థల మధ్య సహకారం, శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.






