తెలంగాణ అండర్-17 జట్టుకు నిర్మల్‌కు చెందిన జాదవ్ ఉమేశ్ జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల గద్వాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు. వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లోని గువాహటిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఉమేశ్ తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. జిల్లా క్రీడాకారుడు జాతీయస్థాయికి ఎంపిక జిల్లా టీ20ఏ కోచ్ రామరాజు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే లీగ్ పోటీల్లోనూ ఉమేశ్ ఇదే ప్రతిభను కొనసాగించాలని ఆకాంక్షించారు. కష్టపడి రాణించి భవిష్యత్తులో రంజీ, ఐపీఎల్ జట్లకు ఎంపికై నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోచ్ రామరాజు ఆకాంక్షించారు.
జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు నిర్మల్ క్రీడాకారుడు జాదవ్ ఉమేశ్ ఎంపిక
Share:

సారాంశం
తెలంగాణ అండర్-17 జట్టుకు నిర్మల్‌కు చెందిన జాదవ్ ఉమేశ్ జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల గద్వాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు.
ముఖ్య విషయాలు
- తెలంగాణ అండర్-17 జట్టుకు నిర్మల్‌కు చెందిన జాదవ్ ఉమేశ్ జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.
- జిల్లా క్రీడాకారుడు జాతీయస్థాయికి ఎంపిక జిల్లా టీ20ఏ కోచ్ రామరాజు హర్షం వ్యక్తం చేశారు.
- ఇటీవల గద్వాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు.
- వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లోని గువాహటిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఉమేశ్ తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
