భైంసా, 15 November
ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద కృష్ణా నర్సింగ్ హోమ్ లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఎన్ ఈ హెచ్ ఎస్ (న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్) సేవలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా నర్సింగ్ హోమ్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అన్ని రకాల సేవలు ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ దీపా జాదవ్, ఎన్ ఈ హెచ్ ఎస్ కార్డు కలిగిన మహిళలకు ఉచితంగా డెలివరీలు, గర్భసంచికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు. డాక్టర్ సుమల ఎండి, గుండె సంబంధిత వ్యాధులకు, పక్షవాతం, విష జ్వరాలు మొదలైన వాటికి చికిత్స అందిస్తారని తెలిపారు. డాక్టర్ పవన్ కుమార్ ఎమ్మెస్ ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తారని తెలిపారు. డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, నవజాత శిశువులకు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు కూడా ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల ఎన్ ఈ హెచ్ ఎస్ సేవలు ఒకే చోట కృష్ణా నర్సింగ్ హోమ్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






