నిర్మల్, 15 November
జనజాతీయ గౌరవ్ దివస్, భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బిర్సా ముండా గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు.
జనజాతీయ గౌరవ్ దివస్, భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా గిరిజన, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో పోరాడి, గిరిజన సమాజంలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపిన ఆయన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
గిరిజనుల ఆత్మగౌరవం, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి, ఆయన త్యాగనిరతి నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గిరిజనుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, రామణారెడ్డి, జమాల్, మేడిసేమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, జిల్లా కార్యదర్శి పుస్పూర్ నర్సారెడ్డి, మోర్చా జిల్లా అధ్యక్షులు పండిత్ జాదవ్, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, కూన శశాంక్, ఈశ్వర్, మండలాల సర్పంచులు వెంకటేష్, హరీష్, విజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.



