నిర్మల్, 15 November
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇన్చార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్‌కు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బి.ఎం. సందీప్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని బాణావత్ గోవింద్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.






