దేశవ్యాప్తంగా (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 15
విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన మట్టి తడవని వాన జాతీయ కవితా పోటీలో కవి డా. పెరుక రాజు విజేతగా నిలిచారు.
కళలకు సారథి మీరు... మీ కలలకు వారధి మేము అనే నినాదంతో జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అయిన విశ్వ సాహితీ కళావేదిక నిర్వహించిన మట్టి తడవని వాన జాతీయ కవితా పోటీలో దేశవ్యాప్తంగా 350 మందికి పైగా కవులు, రచయితలు పాల్గొన్నారు.
ఈ పోటీలో తన సృజనాత్మక కవిత్వంతో విశిష్ట ప్రతిభ కనబరిచిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు డా. పెరుక రాజు విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా విశ్వ సాహితీ కళావేదిక ప్రతినిధులు ఆయనకు అభినందన పత్రాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డా. పెరుక రాజు పేర్కొన్నారు.
కార్యక్రమ విశేషాలు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత, విశ్వ సాహితీ కళావేదిక చైర్పర్సన్ జి. భవాని, కొల్లి రమావతి, అంజని కుమారి, శ్రీకాంత్, భారతి దేవి, జంధ్యాల శరత్ బాబు, కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, మహేశ్వరి, ఆలపాటి సత్యవతి, దొంతు ప్రభావతి తదితరులు పాల్గొని, డా. పెరుక రాజును అభినందించారు.






