గుమ్మడిదల, 15 November
ఉత్తమ విద్యను, క్రమశిక్షణను, మంచి భవిష్యత్తును అందిస్తూ వేలాది మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన నిర్మల్ పట్టణంలోని బ్రాహ్మణ పురిలోని శాంతినికేతన్ పాఠశాల అని నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, వశిష్ట విద్యాసంస్థల చైర్మన్ వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
బాలల దినోత్సవ వేడుకలు
బాలల దినోత్సవ ఉత్సవాల్లో పాఠశాల డైరెక్టర్ ఎస్. పద్మనాభ గౌడ్, సెక్రటరీ, పాఠశాల కరస్పాండెంట్ భగవతి పద్మనాభ గౌడ్, ప్రిన్సిపాల్ శ్రీకాంత్, రమణ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 35 ఏళ్లుగా విద్యార్థులను ఉత్తములుగా తీర్చి దిద్దిన సంస్థ అని నిర్వాహకులను అభినందించారు.
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సురక్షితమైన వాతావరణం, దేశానికి మంచి వ్యక్తిత్వం కలిగిన భావితరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై, విద్యాసంస్థలపై ఉందన్నారు. ఇది దేశ అభివృద్ధికి, సమాజ పురోగతికి ఉపయోగపడుతుంది. బాలలను ఆనందంగా, విజ్ఞానవంతులుగా ఎదిగేలా తీర్చిదిద్దినప్పుడే చాచా నెహ్రూ కలలుగన్న ఆదర్శ భారతదేశం సాకారం అవుతుందని ఆయన ఉద్బోధించారు.






