కొత్తకోట, 13 November
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి, పంట విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో దేవరకద్ర శాసనసభ్యుడు జి. మధుసూదన్ రెడ్డి సహకారంతో మండలంలోని చర్లపల్లి, అప్పరాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పామాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు నాగారపు బీచ్పల్లి యాదవ్ ఈ కేంద్రాలను ప్రారంభించారు.
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి, పంట విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో దేవరకద్ర శాసనసభ్యుడు జి. మధుసూదన్ రెడ్డి సహకారంతో మండలంలోని చర్లపల్లి, అప్పరాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
పామాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు నాగారపు బీచ్పల్లి యాదవ్ ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పంట చేతికొచ్చిన సమయంలో రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల ధాన్యం విక్రయాలకు వెసులుబాటు కలుగుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు, అప్పరాల సర్పంచ్ మసన్న, చర్లపల్లి సర్పంచ్ సూదిని శోభ, పామాపూర్, రామాపూర్ సింగిల్ విండో డైరెక్టర్లు శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాధవ్, నాగమ్మ, రాములు, భారతయ్య, చెన్నప్ప, వెంకటేష్, చిన్నపాక దేవమ్మ, ధర్మానాయక్, ఎల్లారెడ్డి, పరమేష్ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశీ పెంటన్న యాదవ్‌తో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు సహకరించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి నాయకులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.






