గుంటూరు, 2026-11-15
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం () శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం () శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలోని పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు
ఎన్నికల నోటీసు జారీ మరియు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు) వార్డు వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన: నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: (సాయంత్రం 5:00 గంటల వరకు) నామినేషన్ల పరిశీలన: (ఉదయం 8:00 గంటల నుంచి) తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ గడువు: (సాయంత్రం 5:00 గంటల వరకు ఆర్డీవో వద్ద) అప్పీళ్ల పరిష్కారం: నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ: (మధ్యాహ్నం 3:00 గంటల వరకు) పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన: (మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత)
పోలింగ్ తేదీ: (ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు) ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: (మధ్యాహ్నం 2:00 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం, పూర్తయిన వెంటనే ఫలితాల వెల్లడి) ఉప సర్పంచ్ ఎన్నిక: ఫలితాలు వెలువడిన అదే రోజున నిర్వహణ (అనివార్య కారణాల వల్ల ఆ రోజు వీలుకాకపోతే మరుసటి రోజు సెలవు దినమైనా తప్పనిసరిగా నిర్వహించాలి).
రీపోలింగ్ మరియు ఇతర సూచనలు
రీపోలింగ్ (అవసరమైతే): (ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి కౌంటింగ్). న్యాయస్థానాల స్టే ఉత్తర్వులు ఉన్న పంచాయతీలు లేదా ఇతర న్యాయ, పరిపాలనా పరమైన అడ్డంకులు ఉన్న చోట్ల ఎన్నికల నోటీసులు జారీ చేయవద్దని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.






