సారంగాపూర్, 2026-11-12
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయంలో 2026-27 సంవత్సరానికి వ్యాపార, సేవా హక్కుల కేటాయింపునకు ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ వేలం గురువారం జరుగుతుంది.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ అడెల్లి శ్రీ మహాపోచమ్మ దేవస్థానంలో వివిధ వ్యాపార, సేవా హక్కుల కేటాయింపునకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు 202627 సంవత్సరానికి సంబంధించిన హక్కుల వేలం ప్రకటన విడుదల చేశారు. బొమ్మలు, కంకణాలు, సీడీలు, ఫొటోల విక్రయ హక్కులతో పాటు, టెంట్లు, వంటపాత్రల సరఫరా హక్కులకు కూడా వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. , గురువారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భూమయ్య వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు నిర్ణీత సమయంలో ఆలయ ప్రాంగణంలో హాజరై వేలంలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.






