ఉదయం నిద్రలేవగానే దేవుడి ఫోటో ముందు, ఆలయాలకు వెళ్లడం, వ్రతాలు ఆచరించడం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు దయ, ద్వేషరహితంగా ఉన్నప్పుడే భక్తికి నిజమైన దీపం వెలిగినట్లు. నుదుటన తిలకం పెట్టుకుంటారు. గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తారు. పండుగల సమయంలో పెద్ద ఎత్తున దానధర్మాలు కూడా చేస్తారు. కానీ ఇంటికి తిరిగి వచ్చాక వృద్ధులైన తల్లిదండ్రుల మాటలను పట్టించుకోరు. వారి అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఇంట్లో పనిచేసే వారితో కఠినంగా మాట్లాడతారు. మరి ఇలాంటి ఆరాధనలో నిజమైన భక్తి ఎంత ఉంది మన సంప్రదాయంలో తల్లిదండ్రులకు అత్యున్నత స్థానం కల్పించారు. తైత్తిరీయ ఉపనిషత్తులోని శిక్షావల్లిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని బోధించారు. అంటే తల్లిని, తండ్రిని, గురువును దైవసమానులుగా గౌరవించాలని సూచించారు. ఇది కేవలం ఒక ఆచార బోధన కాదు, మన జీవితానికి మార్గదర్శకం. తల్లిదండ్రులకు, దేవుడికి పూజలు చేయడం తప్పు కాదు. దానధర్మాలు చేయడం కూడా. మన సంప్రదాయంలో భాగమే. కానీ ఆధ్యాత్మికత ఆలయ గడప దగ్గరే ఆగిపోకూడదు. అది మన ఇంట్లోనూ, మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోనూ కనిపించాలి. వృద్ధులైన తల్లిదండ్రులకు సమయం కేటాయించడం, వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం, కుటుంబ సభ్యులను గౌరవించడం కూడా ధర్మబద్ధమైన జీవనంలో భాగమే.
ఒకసారి ఆలోచించండి. దేవుడి విగ్రహానికి ఖరీదైన పూలమాల వేస్తాం. కానీ మన కోసం జీవితమంతా శ్రమించిన తల్లిదండ్రులకు ప్రేమగా నాలుగు మాటలు చెప్పడానికి సమయం ఉండదు. ఆలయంలో అన్నదానం చేస్తాం. కానీ ఇంటి పక్కనే ఆకలితో ఉన్న వ్యక్తిని పట్టించుకోం. దేవుడి ముందు గంటల తరబడి నిలబడతాం. కానీ బాధలో ఉన్న మనిషి చెప్పే నాలుగు మాటలు వినడానికి ఓపిక చూపించం. భావం, సర్వభూతాల పట్ల మైత్రి.












