భద్రాద్రి బస్సులో చిల్లర విషయంలో తలెత్తిన వివాదం విషాదాంతమైంది. ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం, తోపులాటలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళిక మృతి చెందారు. ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో విషాదం నెలకొంది.
భద్రాద్రి బస్సులో చిల్లర విషయంలో తలెత్తిన వివాదం విషాదాంతమైంది. ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం, తోపులాటలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళిక మృతి చెందారు.
ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో విషాదం నెలకొంది. చిల్లర విషయంలో మొదలైన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.












