జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో రేపు (21న) దసరా మిలాప్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది.
దసరా పండుగ నేపథ్యంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఒకచోట చేరి పరస్పరం ఆత్మీయంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకునేందుకు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
పండుగ వేళ అందరూ కలిసి సంతోషాలను పంచుకుంటూ ఆత్మీయ అనుబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు పేర్కొన్నారు.







