ధమ్మచక్ర పరివర్తన దివస్ను పురస్కరించుకొని మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి దగ్డే ప్రియాంక, రాహుల్ నగర్, భైంసా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దగ్డే ప్రియాంక మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా సమాజంలో సమానత్వ భావనను పెంపొందించుకోవాలని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.


