నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల సోమవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రేవ్, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు గంజాయి రవాణా, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ పి. శ్రీనివాస్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ని రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. దర్యాప్తులో ఉన్న, పెండింగ్‌లో ఉన్న, కోర్టు విచారణ దశలో ఉన్న కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను సమీక్షించారు. ప్రతి కేసులో నిర్దేశిత ప్రామాణిక విధానాలను (ఎస్ఓపీ) పాటిస్తూ దర్యాప్తు చేపట్టాలని డీఎస్పీకి సూచించారు. 5 విధానాన్ని అమలు చేస్తూ ఫైళ్లు, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లను తరచూ తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, సత్యనారాయణ, కృష్ణ, ఎస్ఐ లింబాద్రి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












