సోన్ మండలంలోని వెల్మల్ గ్రామంలో రైతులకు చెందిన 38 క్వింటాళ్ల మొక్కజొన్న చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. సెల్‌ఫోన్ లొకేషన్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన మొక్కజొన్నను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు ఛేదనలో ఎస్సై గోపి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కజొన్న చోరీ కేసులో ఐదుగురి అరెస్టు
Share:

సారాంశం
నేర వార్తలు
ముఖ్య విషయాలు
- సోన్ మండలంలోని వెల్మల్ గ్రామంలో రైతులకు చెందిన 38 క్వింటాళ్ల మొక్కజొన్న చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.
- సెల్‌ఫోన్ లొకేషన్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
- చోరీ చేసిన మొక్కజొన్నను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
- ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,26,136వ్యూస్










