మండలం పోచంపాడు బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు హై-టెన్షన్ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ క్రీడలు ఈనెల 11, 12 తేదీలలో కోరుట్ల మినీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఎంపిక పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.
పోచంపాడు బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ వి మైపాల్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకమని ఏడిపి శ్రీమతి అశ్విని మేడం పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర క్రీడలకు ఎంపికయ్యే విధంగా శిక్షణ ఇచ్చిన పాఠశాల పీఈటి శ్రీ సి ఎస్ సంజీవ్ ను సీనియర్ పిజిటి సుధాకర్, పిజిటి సంతోష్ అభినందించారు. విద్యార్థుల ప్రతిభకు, శిక్షకుల కృషికి ఇది నిదర్శనమని వారు తెలిపారు. రాష్ట్ర క్రీడలకు ఎంపికైన విద్యార్థుల పట్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.











