విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన అస్సాంకు చెందిన హిమశ్రీ బోరో(20) కన్యాకుమారి-దిబ్రూగర్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అదృశ్యమైంది. అనంతరం జిల్లాలో ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. రైలులో రద్దీ ఎక్కువగా ఉందని, బోగీలో తాను ఒక్కతే అమ్మాయిని ఉన్నానని హిమశ్రీ భయపడుతూ చెప్పినట్లు సమాచారం.
అస్సాంలోని గౌహతికి చెందిన హిమశ్రీ బోరో తన డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడి కార్యక్రమాలు ముగించుకుని కన్యాకుమారి-దిబ్రూగర్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో గౌహతికి తిరిగి వెళ్తుండగా.. తెల్లవారుజామున హిమశ్రీ అదృశ్యమైంది.
అదృశ్యం కావడానికి ముందు.. తెల్లవారుజామున 2:39 గంటలకు ఓ స్నేహితురాలికి ఫోన్ చేసి, కొందరు తనను వేధిస్తున్నారని హిమశ్రీ తెలిపింది. ఆ తర్వాత హిమశ్రీ బోరో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని టికులంపాడు వద్ద రైలు పట్టాల పక్కన హిమశ్రీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కదులుతున్న రైలు నుంచి కిందపడిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో ఆమెకు సంబంధించిన బ్యాగులు లభించినట్లు అధికారులు వెల్లడించారు. హిమశ్రీ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిందా.. లేక ఎవరైనా రైలు నుంచి తోసేశారా అనే కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి మృతికి అసలు కారణం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.












