సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలో ఇటీవల మరణించిన రెండు కుటుంబాలను నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వి. సత్యనారాయణ గౌడ్ గురువారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.
చించోలి గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సాయేందర్ గారి సోదరుడు తాండ్ర అడెల్లు (34) ఇటీవల మరణించారు. అదే గ్రామానికి చెందిన రెడ్డి శెట్టి రాజేశ్వర్ భార్య మంజుల (60) కూడా మృతి చెందారు.
ఈ రెండు కుటుంబాలను పరామర్శించిన సత్యనారాయణ గౌడ్, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీరవెల్లి సర్పంచ్ ఎల్లన్న, మాజీ ఉపసర్పంచులు మల్లయ్య, గంగాధర్, వంజర రాజు, సాదు రామ్ రెడ్డి, కే. నరేష్, రమణయ్య, నిమ్మల రమేష్, సుధీర్ సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

