దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. అయితే, ఆ నిరసనను అదుపు చేయడం పేరుతో పోలీసులు ఎంతవరకు బలప్రయోగం చేయవచ్చు అనే ప్రశ్న మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులై 20న జరిగిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ పరిశీలన జరుపుతోంది. అయితే అసలు సమస్య ఈ ఒక్క ఘటనకే పరిమితం కాలేదు. పోలీసుల వద్ద ఎన్నో నియమాలు, మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. నిరసనకారులపై అతి బలప్రయోగం ఎందుకు జరుగుతోందన్నదే అసలు ప్రశ్న.

జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం మేకులు అమర్చిన లాఠీలు, రబ్బర్ బుల్లెట్లు, విద్యుత్ బాటన్లు, పెల్లెట్ గన్స్ కూడా ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అక్కడ నిరసన చేస్తున్న వారిలో కొందరిని పోలీసులు కొట్టిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజా శాంతి పేరుతో పోలీసులు ఉపయోగించే బలానికి హద్దు ఏమిటన్న ప్రశ్న ముందుకొచ్చింది.
రాజ్యాంగానికి విరుద్ధంగా పరిస్థితులు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(బి) పౌరులకు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తోంది. అయితే ప్రజా శాంతి, దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడే పేరుతో ఆ హక్కుపై పరిమితులు విధించేందుకు ఆర్టికల్ 19(3) అవకాశం ఇస్తోంది. అంటే దీని అర్థం నిరసనను పూర్తిగా అణచివేయడం కాదు.. అవసరమైనప్పుడు, చట్టబద్ధమైన పరిమితుల్లో నియంత్రించడం మాత్రమే పోలీసుల బాధ్యత. కానీ వాస్తవ రూపంలో మాత్రం పోలీసుల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. రాజ్యాంగం కల్పించిన నియంత్రణ పేరుతో పరిమితికి మించి బలప్రయోగం చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులను బెదిరిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాల నుంచి వస్తున్న ఆదేశాలే కారణమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సహాయం అందించాలి. కానీ ఇవేవీ అంతగా పాటిస్తున్న దాఖలాలు లేవనే విమర్శలు పోలీసులపై వస్తున్నాయి.
మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి
కేంద్ర హోంశాఖ 1985లో రూపొందించిన పోలీసు ప్రవర్తనా మార్గదర్శకాలు తొలుత ప్రజలను ఒప్పించడం, సూచనలు ఇవ్వడం, హెచ్చరించడం వంటి శాంతియుత మార్గాలను ఉపయోగించాలని సూచిస్తున్నాయి. అవి పనిచేయని పరిస్థితుల్లోనే బలప్రయోగం తప్పనిసరి అయినప్పటికీ.. దానిని కూడా అతి స్వల్పంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా పోలీసులకు సూచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసు బలప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలని, తప్పనిసరి అయితే అవసరమైన కనీస స్థాయికే పరిమితం చేయాలని సూచిస్తున్నాయి. చర్య తీవ్రతకు అనుగుణంగానే బలం ఉండాలి. గాయాలు, నష్టం తగ్గించాలి. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలి.