మండలంలోని కుచ్లాపూర్, కంగుట్ట గ్రామాల్లో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ లబ్ధిదారులకు అందజేశారు. కుచ్లాపూర్కు చెందిన మదస్సు సంగీతకు రూ.1.40 లక్షలు, కంగుట్టకు చెందిన తోట రమేష్‌కు రూ.31 వేల విలువైన చెక్కులను అందించారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందించిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేరుగు భోజన్న, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, కుచ్లాపూర్ సర్పంచ్ మైలి నారాయణ, అరుణ్ రెడ్డి, కుర్మే మహేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు
Share:

సారాంశం
అందజేసిన ఆడే గజేందర్
ముఖ్య విషయాలు
- కుచ్లాపూర్కు చెందిన మదస్సు సంగీతకు రూ.1.40 లక్షలు, కంగుట్టకు చెందిన తోట రమేష్‌కు రూ.31 వేల విలువైన చెక్కులను అందించారు.
- మండలంలోని కుచ్లాపూర్, కంగుట్ట గ్రామాల్లో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ లబ్ధిదారులకు అందజేశారు.
- లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
- సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందించిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4113ఆర్టికల్స్
4,92,631వ్యూస్










