నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతి పీఠంలో, దేశ క్షేమం, ప్రజా క్షేమం, ధర్మ సంస్థాపన, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ధర్మ రక్షణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. పవిత్ర గోదావరి తీరానికి సమీపంలో ఉన్న పీఠంలో పీఠాధిపతి బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో, వేదమూర్తులైన ఋత్విక్కులు శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న యజ్ఞంలో, దేశానికి సర్వారిష్ట శాంతి, విఘ్న నివారణ కోసం స్వస్తి వాచనం; ప్రజల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం ఆయుష్య హోమం; రోగ నిర్మూలన, ఆరోగ్య సమాజం కోసం ధన్వంతరి హోమం; పాలకులకు ధర్మబుద్ధి, సత్యనిష్ఠ, సుపరిపాలనా శక్తి కోసం రాజ్యాధికార హోమం నిర్వహిస్తున్నారు. వేద మంత్ర ఘోషతో పీఠ ప్రాంగణం మార్మోగుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ, దేశ ఐక్యత, లోక కళ్యాణం అనే సంకల్పంతో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. దేశం ధర్మ, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి విశ్వగురువుగా నిలవాలని ఆకాంక్షిస్తూ ధర్మో రక్షతి రక్షితః, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే వేద ఘోషతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యజ్ఞ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక పూజలు, హోమాలను వీక్షిస్తున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
బాసర వేద భారతి పీఠంలో ధర్మ రక్షణ మహాయజ్ఞం
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతి పీఠంలో, దేశ క్షేమం, ప్రజా క్షేమం, ధర్మ సంస్థాపన, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ధర్మ రక్షణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. పవిత్ర గోదావరి తీరానికి సమీపంలో ఉన్న పీఠంలో పీఠాధిపతి బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో, వేదమూర్తులైన ఋత్విక్కులు శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు నిర్వహిస్తున్నారు.
ముఖ్య విషయాలు
- ఈ నెల 17వ తేదీ నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న యజ్ఞంలో, దేశానికి సర్వారిష్ట శాంతి, విఘ్న నివారణ కోసం స్వస్తి వాచనం; ప్రజల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం ఆయుష్య హోమం; రోగ నిర్మూలన, ఆరోగ్య సమాజం కోసం ధన్వంతరి హోమం; పాలకులకు ధర్మబుద్ధి, సత్యనిష్ఠ, సుపరిపాలనా శక్తి కోసం రాజ్యాధికార హోమం నిర్వహిస్తున్నారు.
- నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతి పీఠంలో, దేశ క్షేమం, ప్రజా క్షేమం, ధర్మ సంస్థాపన, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ధర్మ రక్షణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది.
- పవిత్ర గోదావరి తీరానికి సమీపంలో ఉన్న పీఠంలో పీఠాధిపతి బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో, వేదమూర్తులైన ఋత్విక్కులు శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు నిర్వహిస్తున్నారు.
- సనాతన ధర్మ పరిరక్షణ, దేశ ఐక్యత, లోక కళ్యాణం అనే సంకల్పంతో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3975ఆర్టికల్స్
4,81,332వ్యూస్









