జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశిలా క్షేత్రం మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ అనంతపద్మనాభ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహల్లాద రావు, ఈఓ సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రత్యేక పూజలు, తోరాల పంపిణీ
అర్చకులు మధుసూదనాచారి, రమేష్, రవి వాల్మీకి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తోర పూజ చేపట్టి భక్తులకు తోరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.












