మండలంలోని ఆలూరు గ్రామంలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించి, అనంతరం వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.
జనసందోహం మధ్య నిమజ్జనం
గ్రామంలోని పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని సందడి వాతావరణాన్ని సృష్టించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












