ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 3,885వ ర్యాంక్ సాధించి వైద్య విద్యకు ఎంపికైన గ్రామానికి చెందిన సాయి ప్రత్యూష్ను నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు, మండల మాజీ ఎంపీపీ జీ.వి. రమణారావుతో పాటు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకులు జీ. వి రమణారావు మాట్లాడుతూ.. సాయి ప్రత్యూష్ అత్యుత్తమ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడని అన్నారు. భవిష్యత్తులో ఉత్తమ వైద్యుడిగా ఎదిగి సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రమేష్ గౌడ్, నారాయణరావు, గురుస్వామి, జక్కని గజేందర్, డాక్టర్ రమేష్, రమేష్ రాజు, మాధవరావు, ఎనుగందుల గజేందర్, నారాయణ, నితిన్, వంశీతో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.












