మండలంలోని వింధ్యా స్కూల్ ఉపాధ్యాయుడు తలేవార్ సాయినాథ్ కు తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్ సాయినాథ్ ను అభినందించారు.
మండలంలోని వింధ్యా స్కూల్ కు చెందిన ఉపాధ్యాయుడు తలేవార్ సాయినాథ్, తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్ మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సాయినాథ్ కు అభినందనలు తెలిపారు. ఇటువంటి అవార్డులు ఉపాధ్యాయల్లో శిక్షణ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. ఇది ఉపాధ్యాయుల పనితీరుకు గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే. నవీన్ కుమార్ తో పాటు శ్రీ రామ్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, శ్రీలత, పల్లవి, సుమన్య, లావణ్య, సంధ్యారాణి, స్రవంతి, సులోచన, గౌతమి, దివ్య, సౌజన్య, పావని, ప్రేరణ, శరణ్య, లావణ్య, జ్యోతి, కీర్తన, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.












