మండలంలోని జాం గ్రామంలో దాత ఎలేటి అజయ్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన మహాప్రస్థానం (వైకుంఠధామం)ను ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ, గ్రామానికి ఎంతో అవసరమైన వైకుంఠధామాన్ని సొంత నిధులతో నిర్మించి అందించిన దాత ఎలేటి అజయ్ రెడ్డి సేవాభావాన్ని అభినందించారు. ప్రజా అవసరాల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం కూచాడి శ్రీహరిరావు దాత ఎలేటి అజయ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా వైకుంఠధామాన్ని నిర్మించి అందించినందుకు అజయ్ రెడ్డిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రామకిషన్ రెడ్డి, మాజీ డీసీఎంసీ నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాత ఎలేటి అజయ్ రెడ్డి మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల పేర్లపై ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామానికి అత్యవసరంగా అవసరమైన వైకుంఠధామాన్ని పూర్తి చేసి అందించడం సంతోషంగా ఉందన్నారు.
గ్రామ సర్పంచ్ కరీపే విలాస్ మాట్లాడుతూ, వైకుంఠధామం నిర్వహణ బాధ్యతలను గ్రామపంచాయతీ తీసుకుంటుందని తెలిపారు.












