బోథ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న అనుమతిలేని చిరు వ్యాపార సముదాయాలను తొలగించాలని ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు సంబంధిత అధికారులను కోరారు. ఈ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పోలీసు అధికారులు, గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారికి వినతిపత్రాలు సమర్పించారు.
క్లబ్ ఆవరణలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న చిరు వ్యాపార సముదాయాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, క్షుణ్ణంగా పరిశీలన అనంతరం అనుమతిలేని వ్యాపార సముదాయాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఫ్రెండ్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.










