దుకాణదారుడికి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
అన్నవరం దేవస్థానం పరిధిలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వాటర్ బాటిళ్లను విక్రయించిన జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. రూ.18 ఎమ్మార్పీ ఉన్న బాటిల్‌ను రూ.25కు అమ్మిన ఘటనపై కమిషన్ ఈ తీర్పు వెలువరించింది.
*వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!* అన్నవరం : అన్నవరం దేవస్థానంలో రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్‌ను రూ.25కు విక్రయించిన జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.7 లక్షల భారీ జరిమానా విధించింది. పిఠాపురానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై విచారించిన కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది. బాటిల్ అదనపు ధరకు తోడు ఫిర్యాదుదారునికి రూ.10 వేల పరిహారం, కేసు ఖర్చులకు రూ.5 వేలు, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు 45 రోజుల్లోగా చెల్లించాలని దుకాణదారుడిని కోర్ట్ ఆదేశించింది.












