జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఉత్సవాల కోసం దేవస్థానం రూ.20 లక్షలు కేటాయించింది.
జిల్లా కేంద్రంలోని పురాతన ఆలయాల్లో ఒకటైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, యజ్ఞాలు నిర్వహించి మూలవిరాట్టుపై ఉన్న సింధూరాన్ని తొలగించనున్నారు.
ప్రత్యేక దర్శన ఏర్పాట్లు
ఈ సమయంలో అంజన్న మూలవిరాట్టు దర్శనాన్ని నిలిపివేసి, ఉత్సవమూర్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం లభించనుంది. ఈ అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకుని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం రూ.20 లక్షలు కేటాయించి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.












